సూపర్‌స్టార్ మహేశ్‌బాబు-వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహర్షి. మహేష్ 25వ సినిమాగా వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా నిన్న ప్రేక్షకుల ముందుకురాగా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమాస్ బ్యానర్లపై దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్‌లు భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే సత్తాచాటింది మహర్షి.
తాజాగా విడుదల తర్వాత అదే జోరును కంటిన్యూ చేస్తూ తొలిరోజే రికార్డులను బ్రేక్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.33.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 61 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక యుఎస్‌లోనూ సత్తాచాటింది మహర్షి. సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోగా గత రికార్డులన్నింటిని చెరిపేసింది మహర్షి.
మహేశ్‌బాబు కెరీర్లోనే హయ్యస్ట్ ఫస్ట్ డే కలెక్షన్లని సినీవర్గాల సమాచారం. భరత్ అనే నేను తొలిరోజు వరల్డ్ వైడ్‌గా రూ.55కోట్ల గ్రాస్ రాబడితే ఆ రికార్డును సైతం మహర్షి బ్రేక్ చేసేసింది. ఇక నైజాంలో తొలిరోజే 6.38 కోట్ల వసూళ్లను రాబట్టి బాహుబలి రికార్డులను తిరగరాసింది. బాహుబలి తొలిరోజు 6 కోట్లు రాబట్టగా దానిని అధిగమించాడు మహేష్.
135 కోట్ల బడ్జెట్‌తో మహర్షి తెరకెక్కగా ఏపీ, నైజాం, ఓవర్సీస్ అన్నీ కలుపుకుని రూ. 95 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వీటితో పాటు శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్ మరో రూ. 50 కోట్ల బిజినెస్ సాధించడంతో నిర్మాతలు సినిమా విడుదలకు ముందే సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయారు. మొత్తంగా మహర్షి సునామీకి మరిన్ని రికార్డులు బ్రేక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
#Maharshi Day1 AP, TS
Nizam – 6.38 Cr
Ceeded – 2.89 Cr
UA – 2.88 Cr
East – 3.2 Cr
West – 2.47 Cr
Krishna – 1.39 Cr
Guntur – 4.4 Cr
Nellore – 1 CrAP, TS Day 1 Share – 24.6 Cr#Maharshi #SSMB25#EpicBlockbusterMaharshi pic.twitter.com/ZRw8U9dVnp
— BA Raju's Team (@baraju_SuperHit) May 10, 2019