కలర్ స‌్వాతికి కత్తి మహేష్ లవ్ లెటర్..

370
swathi-mahesh
- Advertisement -

మ‌హేష్ క‌త్తి. ప్ర‌స్తుతం సినీజ‌నాల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు అయితే మ‌రీను. అయితే, మ‌హేష్ క‌త్తి మొద‌ట‌గా సినీ విశ్లేష‌కుడిగాను, ద‌ర్శ‌కుడిగాను, అలాగే తెలుగు బిగ్‌బాస్ షో మొద‌టి సీజ‌న్‌లో పాటిస్పేట్ చేసిన‌ప్ప‌టికీ రానంత క్రేజ్ ప‌వ‌ర్ స్టార్‌పై, జ‌న‌సేన పార్టీపై చేసిన వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా సెల‌బ్రెటీ అయిపోయాడు. ఎప్పుడూ ఏదో ఒక అంశంపై నిత్యం వార్తల్లో ఉండే కత్తి మహేష్‌ తాజాగా మరో అంశంతో వార్తల్లో నిలిచాడు. అదేంటంటే హీరోయిన్ కలర్స్ స్వాతికి ప్రేమలేఖ రాశాడు. అంతేకాదు ఇది రెండో ప్రేమలేఖ అంట. తాజాగా స్వాతి నటించిన లండన్ బాబులు సినిమా చూసిన మహేష్ స్వాతి నటనకు ఫిదా అయ్యాడట.

swathi-mahesh

ఆయన స్వాతికి రాసిన లేటర్‌ లో ఏముందంటే.. డియర్ స్వాతి, ఆ మధ్యనేను రాసిన ప్రేమ లేఖ ఇంకా పచ్చిగానే నా మనసులో ఉంది. నీ ప్రతిభకు తగని పాత్రలో నువ్వు కనిపించి కష్టపెట్టిన నా మనసు గాయం మొన్నటివరకు తాజాగానే ఉండేది. కానీ.”లండన్ బాబులు” చూసాను. ముద్దుమాటల స్వాతి ఒక మెచ్యూర్ నటిగా ఎదగడం చూసాను. ఒక్క మాట కూడా అవసరం లేకుండా కళ్ళతో, పెదాలతో, నవ్వుతో, కనుబొమ్మల ముడితో, కనురెప్పల వాల్పుతో, విరిసీ విరియని నవ్వుతో, వంకించిన మెడతో, పదానికి పదానికి మధ్య పాజ్ తో నటించగల ప్రతిభని మళ్ళీ చూసాను. సూర్యకాంతంతో ప్రేమలో పడ్డాను. స్వాతి.. నీతో మళ్ళీ ప్రేమలో పడ్డాను.మొదట జాలిపడి. తరువాత అభిమానించి సహాయం చేసిన గాంధీ మాటలు రావని చెప్పి మోసం చేశాడని తెలిసిన క్షణంలో, మోసపోయాననే కోపం, అతని నిస్సహాయత మీద జాలి, మూగవాడు కాదనే ఆనందం ఇన్ని భావాల్ని ఒక్క క్షణంలో పలికించగల నటుల్ని వెళ్ల మీద లెక్క పెట్టగలం. ఆ వెళ్లలో మొదట పలికే పేరు ఇప్పుడు నీది. క్లైమాక్స్ లో గాంధీ పెళ్లి చేసుకుందామా అన్నప్పుడు, ప్రేమో కాదో తెలియని సందిగ్దత, అవధులు లేని అభిమానపు వెల్లువ, ఎక్కడో కాదనాలనే ఆత్మాభిమానం, ఎందుకు వద్దనాలి అనే తీవ్రమైన ప్రేమ. అనుమానం. ఆనందం. సహజమైన సిగ్గు. బిడియాన్ని పక్కకు నెట్టే ఆలోచన. నాకు కావలసింది నాకు తెలుసు అనే ధీమా. నిన్ను నేను నమ్ముతాను అనే భరోసా. ఇన్ని భావాల్ని ఒక్క విరిసివిరియని స్మైల్ లో చెప్పావు చూడు.హ్యాట్సాఫ్! అందుకే ఆగలేక. మనసు ఆపుకోలేక, రాసాను ఈ లేఖ. అందుకో ఈ ప్రేమ లేఖ. అని స్వాతిక కత్తి మహేష్‌ లెటర్‌ రాశాడు.

- Advertisement -