మహేశ్‌తో మూవీ..క్లారిటీ ఇచ్చేశాడు!

151
mahesh
- Advertisement -

ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న దర్శకధీరుడు రాజమౌళి….సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమాపై క్లారిటీ ఇచ్చేశాడు. మహేష్ బాబుతో సినిమాని కన్ఫర్మ్ చేస్తూనే ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించిన కార్యక్రమంలో మరో ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం సరికాదని ఈ సినిమా విడుదల అనంతరం ఆ సినిమా గురించి మాట్లాడుకుందామని తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.

ముందుగా ఆర్‌ఆర్‌ఆర్‌ని గ్రాండ్‌ సక్సెస్‌ చేసి ఆ తర్వాత మహేష్‌తో సినిమా చేస్తానన్నాడు. రాజమౌళి తండ్రి ,బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్… మహేష్ కోసం కథను సిద్ధం చేశాడు. మహేశ్‌కి కూడా కథ నచ్చడంతో సినిమాపై రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

ఇక ఆర్‌ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా మేకర్స్ మొదలు పెట్టిన ప్రచారం మరింత హైప్స్ పెంచేస్తుంది. దర్శక, నిర్మాతలు రాజమౌళి-దానయ్య దగ్గర నుండి ఎన్టీఆర్-చరణ్-అలియా సహా అంతా కలిసి మూకుమ్మడిగా అన్నిబాషలలో ప్రచారం హోరెత్తిస్తున్నా

- Advertisement -