పుష్ప బ్లాక్ బస్టర్ పక్కా..!

52
pushpa movie

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకుక్కుతున్న చిత్రం పుష్ప. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుంది. ‘పుష్ప ది రైజ్’ పేరిట తొలి భాగం విడుదలకు ముస్తాబవుతోంది.

సినిమా చూసిన సెన్సార్ సభ్యులు యు/ఏ సర్టిఫికేట్ ఇవ్వడమే కాదు సినిమా బ్లాక్ బాస్టర్ అంటూ పేర్కొన్నారు. సెన్సార్ సభ్యుల నుండి ప్రశంసలు రావడంతో పుష్ప టీమ్ ఫుల్ జోష్‌లో ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం పక్కా అని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

పాన్ ఇండియా లెవల్లో వరల్డ్ వైడ్ గా మూడు వేల ధియేటర్లకు పైగా పుష్పని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు టీమ్. రేర్ గా దొరికే ఇలాంటి కథలకు బన్నీ కంప్లీట్ గా న్యాయం చేశారని, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ రేసింగ్ లా ఉంటుందని సినిమా మీద ఇంకాస్త హైప్స్ పెంచేశారు.