సూపర్ స్టార్ అభిమానులకు షాకింగ్ న్యూసే ఇది.. ఇటీవల రిలీజ్ అయిన మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్‌లో మహేష్ ఒకస్థానం దిగజారి 7వ స్థానంలో పడిపోయాడు. ఈ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్న మహేష్ 2015లో ఆరవ స్థానంలో నిలిచాడు. గతేడాది వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ కావడం.. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆలస్యం అవుతుండడం.. మహేష్ ర్యాంక్‌కు అడ్డుగా నిలిచాయనడంలో సందేహం లేదు. ఇక మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో తొలి స్థానాన్ని మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖండేల్వాల్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా విరాట్ కోహ్లీ, హృతిక్ రోషన్, రణవీర్ సింగ్, ఫవాద్ ఖాన్ లు ఉన్నారు. దక్షిణాది హీరోల్లో ప్రభాస్ 22వ ర్యాంకులో నిలవగా రానా 24, ధనుష్ 26 స్థానాల్లో నిలిచారు.
ఇటీవలే స్పైడర్ మూవీ క్లైమాక్స్ షూటింగ్ ముగించుకున్న మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా షూటింగ్‌తో బిజీగా వున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొరటాల సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు మహేష్. 2016లో నాగార్జున, కార్తీలు ప్రధాన పాత్రలుగా వచ్చిన ఊపిరి సినిమా వంశీ మంచి పేరుని తెచ్చింది. మహేష్ బాబు కెరీర్‌లో 25వ సినిమాగా రానున్న ఈ మూవీ తమ ఇద్దరి కెరీర్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ అవనుంది అని తాజాగా వంశీ పైడిపల్లి అభిప్రాయపడ్డారు.