బాలీవుడ్ మూవీలో ప్రభాస్ కేమియో ‌..

234
- Advertisement -

బాహుబలి సక్సెస్‌ తర్వత బాలీవుడ్ లో ప్రభాసకి మంచి క్రేజ్‌ పెరిగింది. సమయం వచ్చిన్నప్పుడలా ఎదో ఒక్క సందర్బంలో ప్రభాస్‌ గురించి తెగ వార్తలు వచ్చేస్తున్నాయి. అక్కడి స్టార్ హీరోలతో సమానంగా యంగ్ రెబల్ స్టార్ కు ఇమేజ్ వచ్చేసింది. బాహుబలి2 తర్వాత ప్రభాస్ గురించి ఏదో ఒక అప్డేట్ చెప్పేందుకు.. ఛానళ్లు-వెబ్ సైట్స్ కూడా తెగ ఉత్సాహం చూపించేస్తున్నాయి. తాజగా ప్రభాస్ పై వచ్చిన న్యూస్ ఏంటంటే.. ఓ బాలీవుడ్ మూవీలో ప్రభాస్ కేమియో చేస్తున్నాడట.

Prabhas's cameo in Tamannah's Khamoshi?

బాలీవుడ్‌లో గాని టాలీవుడ్‌లో ప్రభాస్ ఓ సినిమాలో నటిస్తున్నాడంటే కచ్చితంగా ఆ మూవీ క్రేజ్ పెరుగుతుంది. ఇప్పుడు ప్రభుదేవా- తమన్నాలు నటిస్తున్న ఖామోషీ చిత్రంలో ప్రభాస్ కేమియో చేస్తున్నాడంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రభాస్- తమన్నాలు మంచి ఫ్రెండ్స్ కావడం.. బాహుబలి సిరీస్ లో కలిసి నటించడం వంటి రిలేషన్స్ కారణంగా.. ఒక కేమియో కోసం అడగ్గానే ప్రభాస్ ఒప్పుకున్నాడని.. స్టోరీకి కీలకమైన మలుపు తిప్పే దగ్గర ఈ రోల్ వస్తుందని చెప్పేస్తున్నారు.

ఈసినిమా చక్రి తోలేటి దర్శకత్వంలో వషు భగ్నాని నిర్మాణంలో రూపొందుతుంది.. కోలీవుడ్ మూవీ కొలైయుథిర్ కాలంకు హిందీ రీమేక్. తమిళ్ లో నయన్ రోల్ ను.. హిందీలో తమన్నా చేస్తోంది. అయితే.. ప్రభాస్ కేమియోపై మాత్రం దర్శక నిర్మాతలు నోరు విప్పడం లేదు. సినిమా రిలీజ్ అయ్యాకే థ్రిల్స్ అన్నీ తెలుసుకోవాలని చెప్పేస్తున్నారు. గతంలో యాక్షన్ జాక్సన్ సినిమాలో కూడా ప్రభాస్ ఇదే విధంగా ఒక కేమియో చేశాడు. కాని అప్పట్లో మనోడి కేమియో అంతగా హైలైట్ కాలేదు. మరి ఈ సారి ప్రభాస్‌ చేసే ఈ పాత్ర వల్ల సినిమాకి ఎంతవరకు ప్లస్‌ అవుతుందో చూడాలి

- Advertisement -