త్వరలోనే ఆ ఇద్దరితో సినిమా చేస్తాః మహేశ్ బాబు…

598
mahesh
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా మహర్షి. ఈమూవీ ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మహేశ్ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటించగా..అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈసినిమాను దిల్ రాజు, అశ్వినిదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేశారు చిత్రయూనిట్. ఈసందర్భంగా మహేశ్ బాబు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అయిత ఈసందర్బంగా సుకుమార్ రాజమౌళి లతో సినిమాల గురించి ప్రస్తావించాడు. మహర్షి సినిమా తర్వాత మంచి కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు మహేశ్. అయితే సుకుమార్ సీరియస్ గా సాగే కథను తీసుకువచ్చారని…అందువల్లే ఆ కథను పక్కనే పెట్టి వేరే దర్శకుడికి అవకాశం ఇచ్చానని చెప్పారు.

అయితే త్వరలోనే సుకుమార్ తో మరో సనిమా తప్పకుండా చేస్తానని చెప్పారు. రాజమౌళితో కూడా సినిమా చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ఈసినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఉంటుందని వెల్లడించారు మహేశ్ బాబు.

- Advertisement -