పోకిరిని మరచిన మహేష్..లవ్యూ చెప్పిన పూరీ

211
mahesh babu

మే డే సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన 24 సినిమాల దర్శకులను గుర్తుచేసుకున్న మహేష్ తనకు పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్‌ని మర్చిపోయారు.

ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా స్పందించారు మహేష్. నా స్పీచ్‌లో ఓ ముఖ్యమైన వ్యక్తి గురించి మరిచిపోయాను. ఆయనే పూరీ జగన్నాథ్. నా 25 సినిమాల జర్నీలో పోకిరి చిత్రం నన్ను సూపర్‌స్టార్‌ని చేసింది. నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమది. పూరి జగన్నాథ్‌గారికి థాంక్స్ అంటూ ట్వీట్ చేసి హుందా తనాన్ని చాటుకున్నారు. మహేష్ ట్వీట్‌పై స్పందించారు పూరి. ధన్యవాదాలు సార్…ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటా.. మహర్షి ట్రైలర్ రాకింగ్‌ అంటూ ట్వీట్ చేశారు.

2006లో వచ్చిన పోకిరి టాలీవుడ్‌ను షేక్ చేసింది. అప్పటివరకు టాలీవుడ్‌లో ఉన్న రికార్డులను తిరగరాస్తూ రూ. 66 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో మహేష్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఎవ్వడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దే ఆడే పండుగాడు అంటూ మహేష్ చెప్పిన డైలాగ్‌ ఇప్పటికి అందరికి గుర్తుండే ఉంటుంది. అందుకే తన పొరపాటును గుర్తించి సోషల్ మీడియా ద్వారా స్పందించారు మహేష్.