తీరం దాటిన ఫోని..సిక్కోలుకు తప్పిన ముప్పు

164
Cyclone Fani Hits Odisha

తీవ్ర తుపానుగా మారిన పోని ఏపీ తీరం దాటి ఒడిశాలోకి ప్రవేశించింది. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తగా పలుచోట్లు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. శ్రీకాకుళం జిల్లాకు ఫొని తుపాను ముప్పు తప్పినట్లేనని తెలిపారు జిల్లా కలెక్టర్ జె నివాస్‌. తుపాను కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఆయన ఆర్టీజీఎస్ ముందుగా సూచించిన విధంగాను తుపాను గమ్యం సాగిందన్నారు.

తుపాను ప్రభావంతో కంచిలి మండలంలో 19 సెంటీ మీటర్లు,సోంపేటలో 10 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని ఇచ్చాపురం మండలంలో 140 కిమీ వేగంతో గాలులు వీచాయన్నారు. సముద్ర తీరానికి దగ్గర్లో ప్రమాదం కలుగుతుందని ముందస్తు అంచనా మేరకు ఆ గ్రామాల నుంచి ప్రజలను తరలించామన్నారు.స్తంభాలు కొన్ని వాలిపోయినట్లు సమాచారం అందిందని తెలిపారు. వాటిని తక్షణం పునరుద్ధరిస్తామని చెప్పారు.

ఇవాళ ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల మధ్య ఒడిశాలోని గోపాలపూర్‌- చాంద్‌బలీ మధ్య తీరం దాటుతుందని రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) తెలిపింది. తుపాను ఇంకా ప్రచండంగానే కొనసాగుతుందని తెలిపారు.