మహేష్‌కు కోపం వచ్చింది..!

262
Mahesh Babu deadline to AR Murugadoss
Mahesh Babu deadline to AR Murugadoss
- Advertisement -

బ్రహ్మోత్సవం సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావలసింది గానీ, కొన్ని కారణాల వలన ఆలస్యమవుతోంది. కొన్ని షెడ్యూల్స్ ను మురుగదాస్ ఎక్స్ టెండ్ చేసినా .. మహేశ్ కాల్షీట్స్ ను కేటాయిస్తూనే వచ్చాడు. ఇక రీసెంట్ గా మాత్రం, ఈ నెల 20తో తనకి సంబంధించిన వర్క్ ను పూర్తి చేయమని మురుగదాస్ కి మహేశ్ తేల్చి చెప్పాడట. ఈ తేదీ తరువాత తన డేట్స్ అడగవద్దని అన్నట్టుగా చెప్పుకుంటున్నారు.

నిజానికి స్పైడర్ సినిమా జూన్ 23న విడుదల కావాల్సి ఉంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల వల్ల విడుదల కాస్త పోస్ట్‌పోన్ అయింది. అది కూడా ఆగస్ట్‌ 11న ఈ సినిమా విడుదలకు ముహుర్తంగా పెట్టినట్టు వార్తలు వచ్చాయి. మళ్లీ కట్ చేస్తే ఈ డేట్‌ కూడా ఓకే కావాట్లేదని ఇన్‌సైడ్ టాక్. అక్టోబర్ లో రిలీజ్ అయితే బెటర్ అని ప్లాన్ చేశారంటూ ఇప్పుడు కొత్త టాక్ వినిపిస్తోంది. మహేష్ అండ్ రకుల్ లీడ్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినా కూడా.. ఇంకా పాటలు పెండింగ్ ఉన్నాయి. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కు టైమ్ తీసుకుంటోంది.

Spyder Telugu Movie Stills

మరోవైపు మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందనున్న మరో చిత్రం మరికొన్ని రోజుల్లోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. ఇప్పటికే కొరటాల సినిమాకు అడ్వాన్స్‌ తీసుకున్న మహేష్.. జూన్‌ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ పాల్గోనబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను ఐదారు నెలల్లోనే ఫినిష్ చేసి సంక్రాంతికి ఎలాగైనా విడుదల చేయాలని మహేష్.. నిర్మాత డివివి దానయ్యలు భావిస్తున్నారట. ఆ మేర‌కు 11 జ‌న‌వ‌రి 2018 తేదీని కూడా డిసైడ్ చేశారని టాక్. కాగా, సంక్రాంతి రేసులో మ‌హేష్‌కి అరుదైన రికార్డ్ ఉంది. గ‌తంలో ‘ఒక్క‌డు’, ‘సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు’ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్లు సంక్రాంతికే రిలీజ‌య్యాయి. ఇప్పుడు మ‌రోసారి అదే త‌ర‌హాలో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకునే ఛాన్సుంద‌ని యూనిట్ భావిస్తోంది.

- Advertisement -