మహేశ్ రెమ్యూనరేషన్… 30నిముషాలకు రూ.30కోట్లు

2466
Chiranjeevi Mahesh Babu

సూపర్ మహేశ్ బాబు వరుస విజయాలతో జోరు మీదున్నాడు. ఇటివలే సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మహేశ్ బాబు తర్వాతి చిత్రంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 152వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఈమూవీ షూటింగ్ జరుగుతుంది. చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తుంది. చిరంజీవి కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను మహేశ్ బాబు పోషించనున్నాడు. దాదాపు అరగంట పాటు మహేశ్ ఈమూవీలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈసినిమాలో చేసేందుకు మహేశ్ బాబు భారీగా రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈసినిమా కోసం మహేశ్ రూ.30కోట్లు తీసుకుంటున్నట్లు ఫిలిం నగర్ వర్గాల టాక్. ఇందులో వాస్తవమెంతోగానీ, ఇప్పుడు ఈ వార్తే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.