సూపర్ స్టార్ మహేశ్ బాబు మహర్షి తర్వాత చేస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈచిత్రానికి ఎఫ్2 దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే ప్రారంభమైన ఈచిత్ర షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతుంది. ఈచిత్రంలో మహేశ్ సరసన రష్మీక మందన హీరోయిన్ గా నటించగా..సీనియర్ హీరోయిన్ , మాజీ ఎంపీ విజయశాంతి కీలక పాత్రలో నటించనున్నారు.
ఇక ఈసినిమాలో మహేశ్ బాబు ఆర్మీ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఓ లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్మీ డ్రెస్ లో మహేశ్ బాబు ఈ ఫోటో లో కనిపించాడు. ఇక ఈసినిమాలో మహేశ్ పాత్ర పేరు చెప్పారు దర్శకుడు అనిల్ రావిపూడి.
ఈసినిమాలో అజయ్ కృష్ణ పాత్రలో మహేశ్ కనిపించనున్నట్లు తెలిపారు దర్శకుడు. ఈ విషయాన్ని ట్వీట్టర్ ద్వారా ప్రకటించారు దర్శకుడు . ప్రముఖ నిర్మాత దిల్ రాజు , అనిల్ సుంకర్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2020సంక్రాంతికి ఈమూవీని విడుదల చేయనున్నారు.
Superstar @urstrulymahesh garu turns into Major Ajay Krishna for #SarileruNeekevvaru! #sankranthi2020 Operation started in kashmir
pic.twitter.com/ta4OYUedQV
— Anil Ravipudi (@AnilRavipudi) July 10, 2019