మహేష్ బాబు మూవీలో రాములమ్మ..

239
vijaya shanthi mahesh babu
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం మహర్షీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈచిత్రాన్ని దిల్ రాజు, అశ్వినిదత్ లు నిర్మిస్తున్నారు. మహేశ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డె నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈచిత్రాన్ని మొదట ఎప్రిల్ 25న విడుదల చేస్తామని ప్రకటించినా..తాజాగా మే9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. మహేశ్ బాబు ఈసినిమా తర్వాత యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈచిత్రం కూడా దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కనుంది. మే మొదటి వారం నుంచి ఈచిత్ర రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈమూవీలో హీరోయిన్ గా రష్మీక మందనను ఎంపీక చేశారు. అయితే తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఈమూవీ నుంచి మరో అప్ డేట్ బయటకు వచ్చింది. తన ప్రతి సినిమాలో ఏదో ఒకరకమైన కొత్త దనాన్ని చూపిస్తాడు అనిల్ రావిపూడి. ఈమూవీలో కూడా తన క్రియేటివిని చూపించనున్నాడు. అందులో భాగంగా ఈమూవీలో లేడి సూపర్ స్టార్ విజయశాంతి ప్రత్యేకమైన పాత్రలో నటిస్తోందట. ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి ఆమెకు కథను వినిపించాడట…కథ నచ్చడంతో ఈసినిమాలో నటించేందుకు రాములమ్మ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం.

ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో విజయశాంతి కొంచెం బిజీగా ఉంది. మే లోపు ఎన్నికలు పూర్తి అవుతాయి కాబట్టి ఆ తర్వాత షూటింగ్ లో పాల్గోనుందని తెలుస్తుంది. విజయశాంతితో పాటి ఈమూవీలో కన్నడ స్ఠార్ ఉపేంద్ర కూడా కీలక పాత్రలో కనపించనున్నాడని సమాచారం. వరుస హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి మహేశ్ తో సినిమా చేస్తుండటంతో ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

- Advertisement -