ఆ 7గురు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలకు టికెట్ కన్ఫామ్..

290
trs
- Advertisement -

తెలంగాణలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా 16 స్ధానాలు కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు సీఎం కేసీఆర్. అందుకు తగ్గుట్టుగా ప్రగతి భవన్ లో వ్యూహాలు రచిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ అధినేత. ఇప్పటికే పార్లమెంట్ స్ధానాల అభ్యర్ధుల ఎంపీక పూర్తైనట్లు సమాచారం. ఇటివలే అసెంబ్లీని రద్దు చేసి ఒకేసారి 105మంది అభ్యర్దులను ప్రకటించి చరిత్ర సృష్టించిన కేసీఆర్…పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అభ్యర్ధుల పేర్లను ముందే ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇప్పటినుంచే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఉన్న 7గురు సిట్టింగ్ ఎంపీలకు కేసీఆర్ మరో ఛాన్స్ ఇచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఇటివలే వారందరిని ప్రగతి భవన్ కు పిలిపించుకుని సీఎం కేసీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఎంపీగా మరోసారి అవకాశం దక్కించుకున్న వాళ్లలో వినోద్ కుమార్(కరీంనగర్), జి.నగేష్ (ఆదిలాబాద్), కవిత (నిజామాబాద్), బీబీ పాటిల్ (జహీరాబాద్), ప్రభాకర్ రెడ్డి (మెదక్), దయాకర్ (వరంగల్), నర్సయ్య గౌడ్ (భువనగిరి) వీరందరికి టికేట్ కన్ఫామ్ అయినట్టు తెలుస్తుంది. ఇక గత ఎన్నికల్లో చేవెళ్ల నుంచి టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

ఆయనకు పోటీగా వరంగల్ జిల్లాకు చెందిన పారిశ్రామిక వేత్త జీ.రంజీత్ రెడ్డికి అవకాశం ఇవ్వనునట్లు తెలుస్తుంది. ఇక పెద్దపల్లి నుంచి మాజీ ఎంపీ వివేక్ పోటీ చేసే అవకాశం ఉండగా..నాగర్ కర్నూల్ నుంచి మాజీ మంత్రి పి.రాములు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మహబూబాబాద్ పార్లమెంట్ స్ధానానికి ముగ్గురు పేర్లను పరిశీలిస్తున్నారు సీఎం కేసీఆర్. ప్రస్తుత ఎంపీ సీతారం నాయక్, డొర్నకల్ ఎమ్మెల్యే కూతురు, మాజీ ఎమ్మెల్యే కవిత, ఢిల్లిలో తెలంగాణ ప్రతినిధి, మాజీ ఐఏయస్ ఆఫీసర్ రామచంద్ర నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్దుల పేర్లను ప్రకటించనున్నట్లు సమాచారం.

- Advertisement -