గాంధీని విశ్వగురువుగా గుర్తించిన ప్రపంచం :కేటీఆర్‌

117
- Advertisement -

మ‌హిషాసురుడిగా మోహన్‌దాస్‌ కరంచంద్‌ని చిత్రీక‌రించ‌డంపై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. కోల్‌క‌తాలో హిందూ మ‌హాస‌భ నిర్వ‌హించిన దుర్గాపూజ‌లో మ‌హిషాసురుడిని మ‌హాత్మా గాంధీలగా చిత్రీక‌రించ‌డాన్ని త‌ప్పుబ‌డుతూ మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వ‌ర్ ట్వీట్ చేశారు. గాంధీ మాదిరి ఏర్పాటు చేసిన మ‌హిషాసురుడిని దుర్గాదేవి చంప‌బ‌డిన‌ట్లుగా చిత్రీక‌రించారు. అయితే గాడ్సేను జాతిపిత‌గా ప్ర‌క‌టించే రోజు దూరంలో లేద‌ని నాగేశ్వ‌ర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌ను కేటీఆర్ రీ ట్వీట్ చేస్తూ ఇలా స్పందించారు. విశ్వ గురువుగా ఈ ప్ర‌పంచం గుర్తించిన ఏకైక భార‌తీయుడు మ‌హాత్మాగాంధీ అని కేటీఆర్ పేర్కొన్నారు. త‌మ‌కు తాము విశ్వ‌గురువుల‌మ‌ని చెప్పుకునే వారు, గాడ్సేను ప్రేమించేవారు.. మ‌హాత్ముడిని, ఆయ‌న ఐడియాల‌జీని కించ‌ప‌రిచే వారు ల‌క్ష‌ల సంవ‌త్స‌రాలైన‌ విజ‌యం సాధించ‌లేర‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

నైరుతి కొల్‌కత్తాలోని రుబీ క్రాసింగ్‌ వద్ద అఖిల హిందూ మహాసభ నవరాత్రి పండల్‌లో ఏర్పాటు చేసిన మహిషాసురిడిగా గాంధీని ఉంచడం వివాదాస్పదంగా మారింది. దీనిపై అనేక మంది విమర్శలు చేస్తుండటంతో వెనక్కి తగ్గి మార్చివేశారు.

- Advertisement -