ఇవాళ ప్రపంచ కార్మిక దినోత్సవం..అలాగే మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి 63 సంవత్సరాలు. సంయుక్త మహారాష్ట్ర కోసం అనేక మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారు. వారందరి బలిదానంతో 1960 మే 1వ తేదీన మహారాష్ట్ర రాష్ట్రం అవతరించింది.
సంయుక్త మహారాష్ట్ర కోసం జరిగిన పోరాటంలో అనేక మంది తెలుగు ప్రజలు కూడా కీలకపాత్ర పోషించారు. మహారాష్ట్ర కోసం ఉద్యమం 1938లో ప్రారంభమైంది. 1955 నవంబర్ 21వ తేదీన సంయుక్త మహారాష్ట్ర కోసం జరిగిన ఆందోళనలలో ముంబైలోని ఫ్లోరా ఫౌంటన్ (నేటి హుతాత్మ చౌక్) పరిసరాల్లో నాటి ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయి ఆదేశాలమేరకు ఆందోళనకారులపై దారుణంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 15 మంది ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా మరో 300 మందికిపైగా ఆందోళనకారులు తీవ్రంగా గాయపడ్డారు.
దీంతో మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. ముఖ్యంగా 1956 జనవరిలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలలో 90 మంది అమరులయ్యారు. వీరితోపాటు అనేకమంది బలిదానాలతో 1960 మే ఒకటవ తేదీ మహారాష్ట్ర రాష్ట్రం అవతరించింది. ఈ నేపథ్యంలో సంయుక్త మహారాష్ట్ర కోసం పోరాడి అమరులైన 105 మంది అమరవీరుల జజ్ఞాపకార్థంగా ఫ్లౌరా ఫౌంటన్ పరిసరాల్లో ‘అమరవీరుల స్మారకాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆ ఫ్లోరా ఫౌంటన్ పేరు మార్చి హుతాత్మ చౌక్‌గా నామకరణం చేశారు.
Also Read:May Day:కార్మిక దినోత్సవం
రాష్ట్రం అవతరించిన సమయంలో 26 జిల్లాలున్న మహారాష్ట్ర ప్రస్తుతం 36 జిల్లాలకు చేరుకుంది. సంయుక్త మహారాష్ట్ర అవతరించిన అనంతరం 1960 మే ఒకటవ తేదీ మధ్యాహ్నం నూతన మంత్రిమండలి ఏర్పాటైంది. రాష్ట్రానికి తొలిస్పీకర్ బాధ్యతలు చేపట్టే గౌరవం తెలుగు వ్యక్తి అయిన సీలం సయాజీరావ్‌కు దక్కింది. బొంబాయి పునర్వ్యవస్థీకరణ చట్టం పార్లమెంట్‌లో అమోదించబడటంతో మహారాష్ట్ర,గుజరాత్ రెండుగా విడిపోయాయి. ప్రసిద్ధి చెందిన షిర్డీ ఆలయం ఈ రాష్ట్రంలోనే ఉంది. అలాగే శనిశింగపూర్ ఆలయం కూడా ప్రసిద్ధి చెందింది.
మహారాష్ట్ర జిల్లాల సంఖ్య -36
లోక్‌సభ స్ధానాలు-48
రాజ్యసభ సీట్లు-19
రాష్ట్ర జంతువు-భారతీయ పెద్ద ఉడుత
రాష్ట్ర పక్షి-పసుపు పాదాల ఆకుపచ్చ పావురం
Also Read:దీనిపై కూడా రాజకీయమా.. తూ!