ఆదివాసీల హక్కుల కోసం పోరాటం నాటి నుంచి నేటి వరకు కొనసాగుతోంది. దేశంలోని అత్యధికంగా ఆదివాసీలు ఉన్న జార్ఖండ్ నుండి ఛత్తీస్‌గఢ్ వరకు చాలా చోట్ల ఆదివాసీలు వారి హక్కుల కోసం పోరాడుతున్నారు. మరోసారి జల్ జంగిల్ జమీన్ కోసం పోరాడటానికి సిద్ధమవుతున్నారు ఆదివాసీలు. మహారాష్ట్ర(గడ్చిరోలి)-ఛత్తీస్ గఢ్ మధ్య సరిహద్దులో ప్రవహిస్తున్న ఇంద్రావతి నదిపై వంతెనను కట్టకూడదని ఆదివాసీలు పోరాడుతున్నారు. గిరిజన సంఘాల సభ్యులు గత 14రోజులుగా రాష్ట్ర సరిహద్దులో మకాం వేసి నిరసనలు తెలుపుతున్నారు.
ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకుడు లాల్సు నొగేటి మాట్లాడుతూ… ఇక్కడ ఎటువంటి ప్రాథమిక సౌకర్యాలు లేవు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. ‘జల్-జంగిల్-జమీన్’ దోపిడీని సులభతరం చేయడానికి ఇటువంటి వంతెనల ద్వారా అటవీ సంపద తరలించుకుపోతారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రకు చెందిన దాదాపు 20 నుంచి 25 గ్రామాల ప్రజలు రాష్ట్ర సరిహద్దులో నిరసనలు తెలుపుతున్న పట్టించుకోవడంలేదని అన్నారు. కాగా ఈ నిరసన జనవరి 4న నుంచి ప్రారంభమైంది.
ఇవి కూడా చదవండి…
మహారాష్ట్రలో గుడ్ల కొరత…
నేటి బంగారం,వెండి ధరలివే..
మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం..