మహారాష్ట్రలో గుడ్ల కొరత…

52
eggs
- Advertisement -

మానవుడు ప్రతిరోజు సంతులిత ఆహారం తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు పోషక నిపుణులు తరుచూ సూచిస్తారు. కానీ అందులో భాగంగా కూరగాయలు, పండ్లు, మాంసం, ద్రవపదార్థాలు, గుడ్లు ముఖ్యమైనవి. కానీ ప్రతి మనిషి రోజుకో ఒక గుడ్డు తినడం వల్ల చాలా పోషకాలు లభిస్తాయని పోషక నిపుణులు సూచిస్తారు. భారతదేశంలో మహారాష్ట్రలో కోడిగుడ్ల కోరత తీవ్రంగా ఉన్నట్టు ఆ రాష్ట్ర పశుసంవర్థక శాఖ కమీషనర్‌ డాక్టర్ ధనంజయ్‌ పార్కలే ప్రకటించారు.

మహారాష్ట్రలో రోజు వారి గుడ్లు వినియోగం 2.25కోట్లు కాగా ప్రస్తుతం 1.25కోట్ల గుడ్లు మాత్రమే వినియోగిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మిగిలిన ఒక కోటీ గుడ్లను పక్క రాష్ట్రాలను నుంచి కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక తెలంగాణ తమిళనాడు నుంచి గుడ్లు దిగుమతి చేసుకుంటున్నట్టు ప్రభుత్వం వర్గాలు పేర్కొన్నాయి. ఔరంగాబాద్‌లో గడిచిన రెండు నెలల నుంచి గుడ్ల ధరలు విపరీతం పెరిగినట్టు మార్కెట్ నిర్వహాకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి…

నేటి బంగారం,వెండి ధరలివే..

రఘునందన్‌వి తప్పుడు ఆరోపణలు: చంద్రశేఖర్

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు ఇకలేరు..

- Advertisement -