చర్చి పునర్నిర్మాణంపై మద్రాస్ కోర్టు

1
- Advertisement -

ప్రజా రోడ్డుకు ఎదురుగా ఉన్న స్వంత స్థలంలో ఒక చర్చిని పునర్నిర్మించుకోవడానికి లేదా విస్తరించుకోవడానికి ఆ పరిసరాల్లోని ప్రాచీన హిందూ దేవాలయం నుండి ఎలాంటి ముందస్తు అనుమతిగానీ, అభ్యంతరాల పత్రం (NOC) గానీ అవసరం లేదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.తమిళనాడులోని విల్లుపురం జిల్లా, తిరుక్కోవిలూర్ ప్రాంతానికి చెందిన ఈఎల్సిఐ సెయింట్ పాల్స్ లూథరన్ చర్చి యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేష్ ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ చర్చి శిథిలావస్థకు చేరడంతో, పునర్నిర్మాణం కోసం చర్చి యాజమాన్యం స్థానిక పురపాలక (మున్సిపల్) అధికారులను సంప్రదించింది.చర్చి స్థలానికి ఎదురుగా ‘శ్రీ ఉలగళంద పెరుమాళ్ కోవెల’ అనే ప్రాచీన ఆలయం ఉంది. తమిళనాడు పురపాలక నిబంధనల ప్రకారం ప్రాచీన స్మారక చిహ్నాలు లేదా ప్రముఖ దేవాలయాల సమీపంలో నిర్మాణాలు చేపట్టాలంటే దేవాదాయ శాఖ మరియు ఆలయ అధికారుల అనుమతి తప్పనిసరి అని అధికారులు పేర్కొన్నారు.

దీనిపై చర్చి కమిటీ హైకోర్టును ఆశ్రయించింది. చర్చి ఉన్న స్థలం మరియు ఆలయం రెండూ ప్రభుత్వ నిబంధనల కింద నోటిఫై చేయబడిన ప్రాచీన రక్షిత స్మారక చిహ్నాలు కావని పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదించారు. చర్చి నిర్మాణానికి ఉలగళంద పెరుమాళ్ దేవాలయం నుంచి ఎలాంటి అనుమతులు లేదా అభ్యంతరం లేని పత్రం (NOC) తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

భారత రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛ మరియు ఆరాధనా హక్కులను ప్రస్తావిస్తూ, చట్టబద్ధమైన నిర్మాణ అనుమతులలో మతపరమైన అంశాలు ఆటంకంగా మారకూడదని అభిప్రాయపడింది. చర్చి సమర్పించిన భవన నిర్మాణ ప్లాన్లను, ఇతర సాధారణ పురపాలక నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో మాత్రమే పరిశీలించి, వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలని స్థానిక అధికారులను కోర్టు ఆదేశించింది.

Also Read:బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల దమనకాండ

- Advertisement -