బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల దమనకాండ

4
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బ్లాక్ టీషర్ట్‌లతో సమావేశాలకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు దమనకాండ ప్రదర్శించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను అసెంబ్లీలోకి రాకుండ అడ్డుకున్నారు.

అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద హరీష్ రావును అరెస్ట్ చేశారు. నల్ల టీషర్ట్ ధరించి అసెంబ్లీలోకి రావడంపై పోలీసుల అభ్యంతరం వ్యక్తం చేయగా టీషర్ట్ విప్పి బనియన్‌తో అసెంబ్లీ గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు, అనిల్ జాదవ్.బనియన్‌తోనే అసెంబ్లీలోకి వెళ్లేందుకు హరీశ్ రావు ప్రయత్నం చేయగా అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద హరీష్ రావును అరెస్ట్ చేశారు పోలీసులు.

అసెంబ్లీ వద్ద పోలీసుల తోపులాటలో కింద పడిపోయారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నల్ల దుస్తులు ధరించి నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల కర్కశంగా వ్యవహరించారు పోలీసులు.అసెంబ్లీ వద్ద పోలీసుల తోపులాటలో కింద పడిపోయిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కాలికి గాయం అయింది.

అసెంబ్లీ ముందు కంటతడి పెట్టుకున్నారు మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. నలుపు రంగు చీర ధరించి అసెంబ్లీకి వెళ్తున్న సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించారు పోలీసులు.

Also Read:BB10:ఈసారి కంటెస్టెంట్స్ వీరే

- Advertisement -