తన పాత్రల కోసం ఎంతో కష్టపడి రూపాంతరం చెందే నటి తాప్సీ పన్ను, తన రాబోయే చిత్రం ‘గాంధారి’ కోసం ప్రత్యేకమైన ఫిట్‌నెస్, డైట్ ప్రణాళికను అనుసరించారు. ఈ సినిమాలో ఎంతో శారీరక శ్రమ, స్టంట్లు అవసరం కావడంతో ఆమె బలం , సత్తువ, కండరాల రికవరీ నిలబెట్టుకోవడానికి ప్రత్యేక డైట్ పాటించారు.
అతి సంక్లిష్టమైన ఆహార పదార్థాల కంటే, భారతీయ సాంప్రదాయక, సులభంగా జీర్ణమయ్యే ఆహారానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. శరీరానికి అవసరమైన ప్రోటీన్, సులభమైన జీర్ణక్రియ కోసం పెసరపప్పును ఆమె ఆహారంలో ముఖ్య భాగంగా చేర్చారు. ఇది జీర్ణవ్యవస్థపై భారం పడకుండా తక్షణ శక్తిని ఇస్తుంది.
చేపలు…లీన్ ప్రోటీన్ మరియు ఓమేగా-3 కొవ్వు ఆమ్లాల కోసం చేపలను ఆమె రోజూవారీ డైట్‌లో భాగం చేశారు. ఇవి కండరాల పునరుద్ధరణకు శరీరంలో వాపులు తగ్గించడానికి ఎంతో దోహదపడతాయి. బరువు తగ్గడానికి కార్బోహైడ్రేట్లను పూర్తిగా మానేయాలనే ప్రచారాన్ని తోసిపుచ్చారు. తీవ్రమైన వర్కౌట్లు, యాక్షన్ సీక్వెన్సెస్ చేయడానికి శరీరానికి అవసరమైన ఇంధనాన్ని సమతులంగా అందించారు.
Also Read:బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల దమనకాండ
కఠినమైన లేదా క్రాష్ డైట్‌లు తాత్కాలిక ఫలితాలనిచ్చినా, దీర్ఘకాలంలో శరీర బలాన్ని దెబ్బతీస్తాయి. అందుకే పోషకాలతో కూడిన సహజమైన ఆహారం తీసుకోవడమే శ్రేయస్కరం. మంచి ఆహారంతో పాటు సరైన సమయానికి నిద్రపోవడం, తగినంత నీరు తాగడం వల్ల శరీరం త్వరగా కోలుకుంటుంది. తాప్సీ పన్ను అనుసరించిన ఈ ప్రత్యేక డైట్ ప్లాన్, కేవలం సన్నబడటమే కాకుండా శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా మార్చుకోవాలనుకునే వారికి మంచి స్ఫూర్తిగా నిలుస్తుంది.

