- Advertisement -
హైదరాబాద్ పోలీస్ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళా సీఐకి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని లాలాగూడ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా మధులత బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర హోంమంత్రి మహముద్ అలీ, పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సమక్షంలో మధులత బాధ్యతలు స్వీకరించారు.
మహిళలకు సరైన స్థానం, గౌరవం ఇవ్వాలని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. ఒక ఎస్‌హెచ్‌వోగా మహిళా ఎందుకు ఉండకూడదనే ఆలోచన వచ్చింది. అందుకే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఒక విమెన్ ఆఫీసర్‌ను ఎస్‌హెచ్‌వోగా నియమించాం అన్నారు. మహిళలు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆనంద్ అన్నారు. తనను ఎస్‌హెచ్‌వోగా నియమించిన సీవీ ఆనంద్‌కు మధులత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -