గీత దాటితే ఫైన్‌…ఆపరేషన్‌ రోప్‌

98
- Advertisement -

హైదరాబాద్ లో ప్రయోగాత్మకంగా ఆపరేషన్ రోప్ స్పెషల్ డ్రైవ్ మొదలైంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 లో సీపీ సీవీ ఆనంద్, ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగ నాథ్ ట్రాఫిక్ ను పర్యవేక్షించారు. ప్రజలను చలాన్ల ద్వారా వేధించడం మా అభిమతం కాదు. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకే ఈ కొత్త నిబంధనలు అమలుచేస్తున్నం అని ఆయన స్పష్టం చేశారు. ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఆపరేషన్ రోప్ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని చెప్పారు.

కరోనా తో నగరంలో వాహనాల సంఖ్య పెరిగిందన్నారు. చాలామంది సొంత వాహనాలు వియోగిస్తున్నారని..దీంతో ట్రాఫిక్ రద్దీ పెరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్ కఠిన తరం చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు. ఆపరేషన్ రోప్ తో వాహనాల రద్దీని తగ్గిస్తామన్నారు. ఈ కొత్త ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన కల్పిస్తామని..రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్లు వేస్తామని హెచ్చరించారు. మరో ముడు, నాలుగు రోజుల పాటు వాహనదారులలో అవగాహన కల్పిస్తామన్నారు.

మొదటగా వాహనదారులలో పరివర్తన రావాలని..అందరూ నిబంధనలు పాటించాలని సూచించారు. అందుకే చలాన్లు వెంటనే విధించడం లేదన్నారు. స్టాప్‌లైన్‌ను దాటేసి వెళ్తున్న వాహనదారులకు రూ.100 నుంచి రూ.200 పెంచినట్టుగా తెలిపారు. ఎడమవైపు వెళ్లే (ఫ్రీ లెఫ్ట్) వాహనాదారులకు అడ్డుగా నిలిచిన వారికి రూ.1000 జరిమానా విధింస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు.

దుకాణదారులు పుట్‌పాత్‌లను ఆక్రమిస్తే జరిమానా విధించడంతోపాటు కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పాదచారులకు ఆటంకం కలిగించేలా పార్కింగ్‌ చేస్తే రూ.600 జరిమానా విధిస్తామని ఆపరేషన్‌ రోప్‌లో పాల్గొన్న అధికారులు తెలిపారు. ట్రాఫిక్‌ నియమాలు పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రోప్ అమలు విధానాన్ని స్వయంగా సీపీ సీవీ ఆనంద్‌ పరిశీలించారు.

- Advertisement -