గ్రీన్ఇండియా ఛాలెంజ్ కి విశేష స్పందన…

97
Green India Challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో బాగంగా CCS CI మాధవి విసిరిన ఛాలెంజ్ ని స్వికరించి లాల గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ మధులత వారి పోలీస్ బృందం తో, తన జన్మదినాన్ని పురస్కరించుకుని సింగోటము శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో తన సతీమణి తో కలిసి కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, మరియు జూబ్లీహిల్స్ జీఎచెంసీ పార్క్ లో తెలంగాణ స్టేట్ టెన్నిస్ ఛాంపియన్ 2021 గర్లపాటి ప్రణిత మొక్కలు నాటారు…

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం కోసం తన వంతు పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉందని హర్షవర్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మధులత మాట్లాడుతూ.. పచ్చదనం పెంపొందించడం కోసం ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ఇండియా ఛాలెంజ్ చేపట్టడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తుచేశారు. అనంతరం సిఐ మాధవి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. తరువాత గోషామహల్ ఇన్స్పెక్టర్ ధనలక్ష్మి, గోపాలపురం ఈశ్వర్, మంజుల అనే మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు..

ఈ సందర్భంగా ప్రణిత మాట్లాడుతూ..పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ఇండియా ఛాలెంజ్ చేపట్టడమే కాకుండా నాలుగు సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగడం గొప్ప విషయం అన్నారు. రేపటి తరాలకు మంచి ఆక్సిజన్ వాతావరణం లభించాలంటే ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. అనంతరం కోచ్ రమేష్ కుమార్,చంద్ర శేఖర్ కుములి, మధు వర్షిణి ముగ్గరిని మొక్కలు నాటాలని ప్రణిత కోరారు.

- Advertisement -