హమాలీలు సమ్మె విరమించాలి: మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

203
53% Distribute Free Rice:Srinivas Reddy
- Advertisement -

పౌరసరఫరాల సంస్థలో పనిచేసే హమాలీల సమస్యల పరిష్కార విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, పేద ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా తక్షణమే సమ్మెను విరమించి విధులకు హాజరు కావాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి హమాలీ యూనియన్లకు బుధవారం నాడు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విధులకు హాజరైన వెంటనే సమస్యలను చర్చించి పరిష్కరిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. హమాలీల న్యాయపరమైన సమస్యల విషయంలో సానుకూలంగా ఉన్నామని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

కోవిడ్-19 నేపథ్యంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు సకాలంలో అందించాలని, గోదాముల్లో బియ్యం లోడింగ్, అన్ లోడింగ్ సమస్యలు రాకుండా, రేషన్ షాపులకు బియ్యం రవాణా జరగాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే అన్ని హమాలీల యూనియన్లతో చర్చించి వారి సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు చేపడతామని చైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.

- Advertisement -