ప్రముఖ టీవీ ఛానల్ ఎడిటర్ పై కేసు నమోదు..

282
MAA complained to police on tv channel
- Advertisement -

టాలీవుడ్‌ సినీ నటులు హైదరాబాద్‌లో ఉంటూ బానిస బతుకులు బతుకుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదాపై నటులు మాట్లాడటం లేదని… ప్రజలు ఇస్తున్న కోట్లాది రూపాయలతో ఏసీ రూముల్లో కులుకుతున్నారని ఆయన మండిపడ్డారు. దీనికి పోసాని కృష్ణమురళీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే.

తాగాజా సినీ పరిశ్రమ గురించి, అందులో ఉండే వ్యక్తుల గురించి అసభ్యకరంగా మాట్లాడారంటూ ఓ ఛానల్ ఎడిటర్ పై సినీ పరిశ్రమ కేసు పెట్టింది. లైవ్ షోలో సినిమావాళ్ల గురించి నోరు జారారంటూ ఫిర్యాదులో పేర్కొంది. సినిమావాళ్లను వేశ్యలతో పోల్చారని, తక్కువ చేసి మాట్లాడారని కేసు పెట్టారు.

ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మా అధ్యక్షుడు శివాజీరాజా, బెనర్జీ, ఏడిద శ్రీరామ్, ఝాన్సీ, హేమా, ప్రగతి, దర్శకురాలు నందిని రెడ్డి తదితరులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే ఈ వ్యాఖ్యలపై మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అన్ని పోలీసు స్టేషన్లలో సినీ పరిశ్రమకు చెందిన వారు ఫిర్యాదులు ఇస్తున్నారని, వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -