‘భరత్‌ అనే నేను’ టైటిల్ సాంగ్..

326
Bharat Ane Nenu Title Song
- Advertisement -

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం ‘భరత్‌ అనే నేను’. ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని కనిపించనుంది. ఏప్రిల్‌ 26న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Bharat Ane Nenu First Single Release Date

‘భరత్ అనే నేను’ సినిమాలో ముఖ్యమంత్రిగా మహేశ్ బాబు నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ కి .. టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. గతంలో కంటే ఈ సినిమాలో మహేశ్ బాబు .. మరింత హాండ్సమ్ గా వున్నాడని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ‘శ్రీరామ నవమి’ పండుగ సందర్బంగా ఈ సినిమా నుంచి మొదటి పాటను ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. ఆడియో వేడుకను వచ్చేనెల 7వ తేదీన వైజాగ్ లో భారీ స్థాయిలో నిర్వహించడానికి ప్లాన్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.

- Advertisement -