వరుణ్‌ సందేశ్‌ ‘ఇందువదన’ నుండి అదిరిపోయే సాంగ్‌..

284
Induvadana
- Advertisement -

వరుణ్‌ సందేశ్‌, ఫర్నాజ్‌ శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “ఇందువదన”. ఎమ్‌ఎస్‌ఆర్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మాధవి ఆదుర్తి నిర్మించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరిపిన క్లైమాక్స్‌ షూటింగ్‌తో ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తైంది. ఇటీవల ఈ చిత్రంలో విడుదలైన వాసు పాత్ర పోషించిన వరుణ్‌ సందేశ్‌, ఇందు పాత్ర చేసిన ఫర్నాజ్‌ పాత్రల లుక్స్‌ను ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

‘వడివడిగా సుడిగాలిలా వచ్చి .. గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా’ అంటూ ఈ సాంగ్ సాగుతోంది. ఓ సెలయేటి ఒడ్డున ఈ పాటను అందంగా చిత్రీకరించారు. మోడ్రన్ లుక్‌తో హీరో.. గిరిజన యువతిగా హీరోయిన్ కనిపిస్తున్నారు. శివ కాకాని సంగీతాన్ని అందించిన ఈ పాటను జావేద్ అలీ.. మాళవిక ఆలపించారు. సతీష్‌ ఆకేటి కథ, మాటలు అందించిన ఈ చిత్రానికి సంగీతం: శివకాకని, సహనిర్మాత: గిరిధర్‌. ఈ చిత్రంలో వరుణ్‌ సందేశ్‌ అటవీశాఖ అధికారి పాత్ర చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://youtu.be/ywlHJtraWPY
- Advertisement -