ష‌ర‌తులు వ‌ర్తిసాయి..లిరికల్ సాంగ్

24
- Advertisement -

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి”. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. “షరతులు వర్తిస్తాయి” సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా నుంచి ‘పాల పిట్టల్లె ప్రేమే వాలె..’ లిరికల్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు దేవ కట్టా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

డైరెక్టర్ దేవ కట్టా మాట్లాడుతూ – “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా నుంచి ‘పాల పిట్టల్లె ప్రేమే వాలె..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. చైతన్య నాకు బాగా ఇష్టమైన యాక్టర్. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, మ్యారేజి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ కంటెంట్ చూస్తుంటే ఇదొక మంచి రూటెడ్ మూవీగా అర్థమవుతోంది. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సైలెంట్ గా రిలీజ్ కు వచ్చి పెద్ద సక్సెస్ అయ్యే సినిమాలా అనిపిస్తోంది. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ – దేవ కట్టా గారు చాలా బిజీగా ఉన్నా మేము అడగగానే మా సాంగ్ రిలీజ్ కు ఒప్పుకున్నారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. మా డైరెక్టర్ కుమారస్వామికి దేవ కట్టా గారు ఫేవరేట్ డైరెక్టర్. ఆయనతోనే మా సెకండ్ సాంగ్ లాంఛ్ చేయించాలని అనుకున్నాం. నాకు బాగా ఇష్టమైన సినిమా “ష‌ర‌తులు వ‌ర్తిసాయి. దేవ కట్టా గారు అన్నట్లు సైలెంట్ గా థియేటర్స్ లోకి వచ్చి సక్సెస్ అందుకోబోతున్నాం. ‘పాల పిట్టల్లె ప్రేమే వాలె..’ సాంగ్ లో లిరిక్స్ గమ్ముత్తుగా ఉంటాయి. మనం మాట్లాడుకునే మాటల్లాగే ఉన్నా..పాటలో చిన్న ఫిలాసఫీ ఉంటుంది. ఈ పాట వినేప్పుడు గమనించండి. అరుణ్ చిలువేరు బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశాడు. క్యాచీ ట్యూన్ ఇచ్చారు. మల్లెగోడ గంగాప్రసాద్ బ్యూటిఫుల్ లిరిక్స్ ఇచ్చారు. వింటూ ఉంటే ఈ పాట ఇంకా నచ్చుతుంది. అన్నారు.

డైరెక్టర్ కుమారస్వామి మాట్లాడుతూ – దేవ కట్టా గారు నా ఫేవరేట్ డైరెక్టర్ మాత్రమే కాదు నాకు గురువు లాంటి వారు. నేను రొవోల్ట్ అవడానికి సార్ ప్రస్థానం మళ్ళీ మళ్ళీ సినిమా చూస్తుంటాను.దేవ కట్టా గారు బిజీగా ఉన్నా మా సినిమా సాంగ్ లాంఛ్ టైం ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాను. వెస్ట్రన్ స్టైల్ ట్యూన్ లో తెలంగాణ సాహిత్యంతో ఈ పాటను రూపొందించాం. ఈ పాట మీ అందరికీ నచ్చుతుంది తప్పకుండా చూడండి. అన్నారు.

Also Read:చౌర్య పాఠం…అదిరిపోతుంది

- Advertisement -