మొక్కలు నాటిన సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రీ

387
rama
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియాల ఛాలెంజ్ అద్భుతంగా సాగుతుంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా నేడు మొక్కలు నాటారు సినీ గేయ రచయిత రామజోగయ్యశాస్త్రీ.ఈ రోజు ఉదయం తన నివాసంలో మూడు మొక్కలు నాటారు.

ఈసందర్భంగా రమజోగయ్య శాస్ట్రీ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహరము స్పూర్తితో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టడం అభినందనీయం అన్నారు. నాకు మొక్కలన్న ,చెట్లన్న చాలా ఇష్టం అన్నారు. పర్యావరణానికి మొక్కలు ఎంతగానో మేలు చేస్తాయి. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందన్నారు. గ్రీన్ ఛాలెంజ్ ను మరో ముగ్గురికి సవాల్ విసిరారు. సినీ కవి చంద్రబోస్,సంగీత దర్శకులు థమన్,సినీ హీరో రాజ్ తరుణ్ మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధి, హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ సుబ్బరాజు పాల్గోన్నారు.

rama

- Advertisement -