నేటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ..

218
mp kavitha nomination
- Advertisement -

మొదటి దశ ఎన్నికలు జరగనున్న లోక్‌సభ స్థానాల్లో, ఏపీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్‌ ప్రక్రియ నేటితో ముగియనుంది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఇప్పటివరకూ 220 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో నిజామాబాద్ నుంచి అత్యధికంగా 60 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి సీట్లు దక్కించుకున్న అభ్యర్ధులు కూడా నేడు నామినేషన్లు వేయనున్నారు. దీంతో నామినేషన్ కేంద్రాలు సందడిగా మారనున్నాయి.

ఏపీలో ఇప్పటికే కీలక నేతలందరూ నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరపున కుప్పంలో ఆయన భార్య నామినేషన్‌ దాఖలు చేశారు. జగన్మోహన్‌రెడ్డి పులివెందులలో దాఖలు చేశారు. పవన్‌కల్యాణ్‌ గాజువాక, భీవమరంలో నామినేషన్లు దాఖలు చేశారు. దాదాపు వేయికిపైగా ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తోంది.

వాస్తవానికి నామినేషన్లకు ఎనిమిది రోజులు సమయం ఉన్నా సరైన మూహూర్తాలు లేకపోవడం, వరుస సెలవులతో పలు చోట్ల నామినేషన్ల దాఖలు ఆలస్యమయ్యింది. ప్రధాన పార్టీలకు చెందిన అధినేతలు శుక్రవారమే తమ నామినేషన్లు దాఖలు చేయగా మిగితా వారు ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన ,28వ తేదీ వరకు ఉప సంహరణకు గడువు ఉంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించి.. గుర్తులను కేటాయిస్తుంది ఎలక్షన్ కమిషన్. ప్రచా రాని ఏప్రిల్ 9తో తెరపడనుండగా ఏప్రిల్ 11న పోలింగ్… మే 25న ఫలితాలు వెలువడనున్నాయి.

- Advertisement -