- Advertisement -
ఏప్రిల్ 20 నుండి కొన్ని సర్వీసులకు కేంద్రం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ మరికొన్ని రంగాలకు వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో లిక్కర్, హెయిర్ సెలూన్ల ఓపెన్‌పై క్లారిటీ ఇచ్చింది కేంద్రం.
తాము కేవలం వస్తువలను అమ్మే షాపులకు మాత్రమే సడలింపు ఇచ్చామని స్పష్టం చేశారు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిలా శ్రీవాత్సవ్. హెయిర్ సెలూన్లు, బార్బర్ షాపులకె ఎలాంటి సడలింపు లేదన్నారు. పట్టణ ప్రాంతాల్లో, కంటోన్మెంట్ జోన్లను మినహాయిస్తే మిగితా ప్రాంతాల్లో షాపులు తెరుచుకునే అవకాశం కల్పించామన్నారు.
మద్యం దుకాణాలు కూడా ఓపెన్ చేయాలని ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని …రెస్టారెంట్లు కూడా తెరవడానికి వీలు లేదని వెల్లడించారు.
- Advertisement -