యంగ్ సెన్సేషన్ విజయ్ దేవర కొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ల పాన్ ఇండియా సినిమా ‘‘లైగర్’’ షూటింగ్ పూర్తి కావస్తోంది. తాజాగా ఈ చిత్రం అమెరికా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో ప్రముఖ బాక్సర్ మైక్ టైషన్, విజయ్ దేవరకొండ, అనన్యపాండేలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఒక చిన్న షెడ్యూల్ మాత్రమే పెండింగ్ లో ఉంది. ఈ షెడ్యూల్ ని భారతదేశంలో తెరకెక్కిస్తారు.
ఈ రోజు అభిమానులకు డబుల్ సర్‌ఫ్రైజ్ ఇచ్చారు నిర్మాతలు. ఈ సినిమా 2022 ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఓ పోస్టర్ విడుదల చేశారు. అంతేకాదు! సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను ఈనెల 31 విడుదల చేయనున్నట్లు తెలిపారు. ‘‘ఈ కొత్త సంవత్సరం.. మంట పుట్టిందాం’’ అంటూ నిర్మాతలు జోష్ పెంచారు.
విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ మూవీ అర్జున్ రెడ్డి కూడా 2017 ఆగస్ట్25నే విడుదలయ్యింది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ అదే తేధిన వస్తున్న లైగర్ కూడా విజయ్ కి మరో కల్ట్, ఐకానిక్ మరియు ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవనుంది.
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా భారతదేశంలోని అతిపెద్ద యాక్షన్ ఎంటర్ టైనర్ లలో ఒకటిగా అలరించనుంది. అంతేకాకుండా ఇందులో లెజెండ్ మైక్ టైసన్ శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. బిగ్ స్క్రీన్ పై విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ నిజమైన యాక్షన్ ను చూసేందుకు అభిమానులు .. సినీ ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ నూతన సంవత్సరం గ్లిమ్స్ యాక్షన్ అభిమానులకు మంచి ట్రీట్ కానుంది.
పూరీ కనెక్ట్స్ తో కలిసి ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందించగా.. థాయ్ లాండ్ కు చెందిన కెచా స్టంట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
హిందీ, తెలుగు,తమిళం,కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న లైగర్ లో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నటీనటులు : విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణురెడ్డి, ఆలి, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను
సాంకేతిక బృందం
దర్శకుడు: పూరి జగన్నాథ్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా
బ్యానర్స్: పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
కెమెరామెన్: విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా
ఎడిటర్: జునైద్ సిద్దిఖీ
స్టంట్ డైరెక్టర్: కెచ్చా