పంజాబ్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌..

324
kl rahul
- Advertisement -

ఐపీఎల్ 13వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి నేతృత్వం వహించనున్నారు భారత స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రాహుల్‌…నేను ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల న్యాయకత్వం లో ఆడాను. కాబట్టి వారి నుండి నేర్చుకున్న పాఠాలను ఇప్పుడు ఉపయోగిస్తానని వెల్లడించాడు.

కుంబ్లే వంటి కోచ్ నాతో ఉండటం ఆనందంగా ఉందని… ఆటగాళ్లను ముందుండి నడిపించడం మరియు జట్టును లక్ష్యాల వైపుకు నెట్టడం వంటివి నేను మా కెప్టెన్ల వద్ద నుండి నేర్చుకున్నానని తెలిపాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. కోచ్‌గా అనిల్ కుంబ్లే….కెప్టెన్సీగా కేఎల్ రాహుల్‌ బాధ్యతలు స్వీకరించడంతో టైటిల్‌పై భారీ ఆశలు పెట్టుకుంది పంజాబ్.

- Advertisement -