బీసీసీఐ కొత్త చీఫ్ సెలెక్టర్ గా మాజీ స్పీన్నర్

439
Laxman Sivaramakrishnan
- Advertisement -

బీసీసీఐ కొత్త చీఫ్ సెలక్టర్ గా ఎల్. శివరామకృష్ణన్ ను ఖరారు చేసినట్లు తెలస్తుంది. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ పదవీ కాలం ముగియనుండటంతో కొత్త చీఫ్ ఎంపికపై బీసీసీఐ కసరత్తులు చేస్తుంది. కాగా డిసెంబర్ 1వ తేదిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కొత్త చీఫ్ సెలెక్టర్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈసమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

భారత మాజీ స్పీన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ను కొత్త చీఫ్ సెలక్టర్ గా నియమించనున్నారని బీసీసీఐ వర్గాల సమాచారం. ప్రస్తుత హెడ్ సెలెక్టర్‌గా ఉన్న ఎంఎస్కే ప్రసాద్ పదవీకాలం ముగియడంతో.. శివరామకృష్ణన్‌కు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు హైదరాబాద్, కర్ణాటకకు చెందిన అర్షద్ అయూబ్, వెంకటేష్ ప్రసాద్ పేర్లు, సెంట్రల్ జోన్ నుంచి జ్ఞానేంద్ర పాండే, గగన్‌ ఖోడా పేర్లు కూడా బీసీసీఐ పరిశీలించినట్టు సమాచారం.

Laxman Sivaramakrishnan As New Chief Selection Of India Cricket

- Advertisement -