‘ఆచార్య’ నుండి లేటెస్ట్‌ అప్‌డేట్‌..

43
Acharya

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై రాం చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తికావొచ్చింది. మరో వారంలోగా ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు సమాంతరంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో చిరుకు జోడి కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే యాక్ట్ చేస్తోంది. సోనూసూద్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. సంగీత, రెజీనా స్పెషల్ సాంగ్స్‌లో కనిపించబోతున్నారు.

తాజాగా ఈ మూవీ నుండి మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. ఈ విషయాన్ని ఈరోజు చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలయిన ప్రచార చిత్రాలు, ‘లాహే లాహే’ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మేలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘ఆచార్య’ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ దశలోనే ఆగిపోయింది. ఇటీవల మళ్ళీ సెట్స్ మీదకి వచ్చిన చిత్ర బృందం టాకీ పార్ట్‌ను కంప్లీట్ చేసింది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. చిరంజీవి బర్త్ డే రోజున ఈ సినిమాకు విడుదల తేదికి సంబంధించి ప్రకటన చేయవచ్చు అంటున్నారు.