శ్రీ మారుతి ఆర్ట్ క్రియేషన్స్ – సిరి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `ప్రేమదేశం`. స్రవంతి శ్రీధర్ నిర్మాత. శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్ కళ్యాణ్, మోహన్, శివ రామచంద్రన్, అక్షయ, రవళి దాసరి, వైశాకి, తేజ నార్ల ప్రధాన తారాగణం. అంతా నవతరం నటీనటులతో తెరకెక్కుతున్న చిత్రమిది. డిసెంబర్ నుంచి రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లి, సమ్మర్ రిలీజ్ లక్ష్యంగా సినిమాని పూర్తి చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు బాబీ చేతులమీదుగా `ప్రేమదేశం` లోగోని ఈ శనివారం ప్రసాద్‌లాబ్స్‌లో లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా బాబి మాట్లాడుతూ-“ప్రేమదేశం అనే టైటిల్ వినగానే నా టీనేజీ డేస్ గుర్తొచ్చాయి. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ చాలా రీఫ్రెషింగ్‌గా ఉంది. ఏదో చిన్న సినిమా అని అనుకున్నాను. కానీ విజువల్స్ చూశాక ఇది చాలా పెద్ద సినిమా అవుతుందనిపించింది. కొత్త వాళ్లే అయినా నటీనటులంతా ఫోకస్సివ్‌గా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. టీమ్ పెద్ద విజయం సాధించాలి. ఆల్ ది బెస్ట్“ అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ-“ఇది చిన్న సినిమాల్లో పెద్ద సినిమా. టీమ్ చాలా బాగా శ్రమిస్తోంది. యువతరం నటీనటుల ప్రతిభ చూశాక కొత్త వాళ్లు అయినా రాజీ లేకుండా సినిమాని నిర్మించాలని భావించాం. పెళ్లి చూపులు తర్వాత అంత పెద్ద హిట్ చిత్రమవుతుంది“ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ -“సినిమా బావుంటే కొత్త కుర్రాళ్లు అయినా మన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా సినిమాని బాగా తీసి మీకు అందిస్తాం. ఇదో హైపర్ లింక్డ్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కే సినిమా. మూడు కథలు ఆద్యంతం రక్తి కట్టిస్తాయి. హైదరాబాద్ నేపథ్యంలో జరిగిన ఓ యాక్సిడెంట్ నేపథ్యంలో రక్తి కట్టించే స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా నడుస్తుంది. ఫ్రెష్‌నెస్, వైవిధ్యం ఉన్న కథాంశమిది. డిసెంబర్ నుంచి రెగ్యులర్ చిత్రీకరణకు వెళుతున్నాం. 2018 వేసవిలో సినిమా రిలీజ్ చేస్తాం. ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం“ అన్నారు.