రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలనే కాంగ్రెస్ కల ఈసారి కూడా కలగానే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ కూడా కేంద్రంలో మళ్ళీ మోడీకే అధికారాన్ని కట్టబెట్టాయి. తాజాగా ఎన్డీ టీవి-సిఎస్టీఎస్ నిర్వహించిన సర్వే కూడా మోడీని అధికారంలోకి వస్తారని తేల్చి చెప్పింది. దీంతో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ నిరాశ తప్పదా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు అనగా 2014,2019 ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన కాంగ్రెస్ కు 2024 ఎన్నికలు అత్యంత కీలకం. ఈ ఎన్నికల్లో ఓడిపోతే పార్టీ మళ్ళీ గాడిన పడడం అంత తేలికైన విషయం కాదు..
ఎందుకంటే మళ్ళీ విజయం కోసం 2029 వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈలోగా జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకొనే అవకాశం లేకపోలేదు. అందుకే ఈసారి ఎన్నికలు హస్తం పార్టీకి డూ ఆర్ డై లాంటివనే చెప్పవచ్చు. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా విజయం కోసం విశ్వ ప్రయత్నలే చేస్తోంది. ఒంటరిగా బరిలోకి దిగితే బీజేపీని ఓడించడం కష్టమే అని భావించి విపక్షాలతో కూడా చేతులు కలిపింది. ఇంకా ఒక మెట్టుదిగి యూపీఏ కూటమిని సైతం మార్చి ఇతర పార్టీలకు అధిక ప్రదాన్యం ఇస్తూ ఇండియా కూటమిలో చేరింది.
Also Read:కేసిఆర్ బరిలో దిగేది..అక్కడినుంచే?
మరి ఈ పరినమలన్నీ చూస్తుంటే కాంగ్రెస్ విజయం కోసం ఎంత పరిస్తాపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు దేశ ప్రజలను ఏకం చేసేందుకు భారత్ జోడో యాత్ర వంటివి చేస్తున్నారు ఆగ్రనేత రాహుల్ గాంధీ. మరి ఇన్ని ప్రయత్నలు చేసిన కాంగ్రెస్ కు ఓటమి తప్పదా అంటే అవుననే చెబుతున్నాయి సర్వేలు. మరి సర్వేలను బట్టి చూస్తే రాహుల్ గాంధీ పిఎం కావడం ఈసారి కూడా కష్టంమే అని తెలుస్తోంది. అయితే సర్వేలే నిజమౌతయా ? అంటే చెప్పలేని పరిస్థితి ప్రజాభిప్రాయం ఎప్పుడు ఎలా మార్పు చెందుతుందో ఊహించడం కష్టమనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట. మరి దేశ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్ ను ఇస్తారో చూడాలి.