ఏ మాస్టర్ పీస్…విలన్ ఫస్ట్ లుక్

47
- Advertisement -

శుక్ర, మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా “ఏ మాస్టర్ పీస్”. అరవింద్ కృష్ణ, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు. ఏ మాస్టర్ పీస్ సినిమా నుంచి తాజాగా సూపర్ విలన్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మనీష్ గిలాడా ఈ సూపర్ విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.

ఫస్ట్ లుక్ లో విలన్ డేట్ ఆఫ్ బర్త్ మూడుసార్లు, డేట్ ఆఫ్ డెత్ రెండు సార్లు రాయడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. 1960లో పుట్టి 1986లో చనిపోయిన ఈ సూపర్ విలన్ మళ్లీ 1986లో పుట్టి 2010లో మరణిస్తాడు. తిరిగి 2010 లో పుట్టి ఎప్పుడు కన్నుమూస్తాడు అనేది ప్రశ్నార్థకంతో ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు. వైవిధ్యమైన కథాంశం ఈ సినిమాలో ఉన్నట్లు విలన్ క్యారెక్టర్ లుక్ ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఏ మాస్టర్ పీస్ సినిమా ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. గతంలో ఈ సినిమా నుంచి విడుదల చేసిన హీరో అరవింద్ కృష్ణ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

స్నేహ గుప్త, అర్చనా అనంత్, జ్యోతి రాయ్, జయప్రకాశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ- శివరామ్ చరణ్, సంగీతం- ఆశీర్వాద్, ఎడిటర్ – మనోజ్ కుమార్. బి, కాస్ట్యూమ్స్ – రియా పూర్వజ్, సలీనా విలియమ్స్, యూకే, స్టంట్స్ – రాజ్ కుమార్ గంగపుత్ర, పీఆర్వో – జీఎస్కే మీడియా, నిర్మాత – శ్రీకాంత్ కండ్రేగుల, రచన దర్శకత్వం – సుకూ పూర్వజ్.

Also Read:కే‌సి‌ఆర్ బరిలో దిగేది..అక్కడినుంచే?

- Advertisement -