రివ్యూ:లంక

184
Lanka movie review
Lanka movie review
- Advertisement -

స్టార్ హీరోలతో సినిమాలు చేసిన నటి రాశి, లాంగ్ గ్యాప్ తరువాత కళ్యాణ వైభోగమే సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే రీ ఎంట్రీలోనూ తన మార్క్ చూపించేందుకు భర్త శ్రీముని దర్శకత్వంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన లంక సినిమా రాశి అనుకున్న విజయాన్ని అందించిందా..? థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన సినిమాలు వరుస సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో లంక మరో హిట్ సినిమా అనిపించుకుందా..?

కథ:
స్వాతి(ఐనా సాహ) ఓ అనాథ. మలయాళంలో కథానాయికగా రాణిస్తుంటుంది. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని లోబరుచుకుంటూ వ్యాపారం చేసే శరత్‌(సిజ్జూ) కన్ను స్వాతిపై పడుతుంది. ఓ షాపింగ్ మాల్ స్వాతి(ఈన సాహా)ను చూసి ఆమెనే హీరోయిన్ గా ఫిక్స్ అవుతాడు శరత్‌. అప్పటికే మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిన స్వాతి ముందు కాదన్న అప్పటికే తాను ఓ పెద్ద ప్రమాదంలో ఉండటంతో దాని నుంచి తప్పించుకోవడానికి షార్ట్ ఫిలిం లో నటించేందుకు ఒప్పుకుంటుంది.

అమెరికా వెళ్లేందుకు వీసా కోసం ఎదురుచూస్తూ ఓ లఘు చిత్రం చిత్రీకరణ కోసం హైదరాబాద్‌ శివార్లలోని బంగ్లాకు వెళ్తుంది. ఆ బంగ్లాలోనే ఉన్న రెబాకా(రాశి)తో పరిచయం ఏర్పడుతుంది. దాంతో ఆమెతో కలిసి స్వాతి అక్కడే నివసిస్తుంది. ఇంతలోనే స్వాతి హత్యకు గురైందన్న వార్త బయటకు వస్తుంది. మరి స్వాతి హత్యకు గురైందా? ఆ హత్య చేసిందెవరు? రెబాకాకు ఆ హత్యకు ఏమైనా సంబంధం ఉందా? ఇంతకీ రెబాకా ఎవరు? రెబాకాకు స్వాతికి సంబంధం ఏంటి..? చివరకు స్వాతి రెబాకాలు ఏమయ్యారు…? అన్నదే మిగతా కథ.

ప్లన్ పాయింట్స్‌:
దర్శకుడు శ్రీముని తన స్క్రిప్ట్‌లో రాసుకున్నదంతా తెరపైకి చాలా స్పష్టతతో తీసుకొచ్చారు.దర్శకుడు ఎంచుకున్న కథ చాలా బాగుంది. అందులో కొత్తదనం కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. రెబాకా పాత్రలో రాశి చక్కగా నటించింది. కథకు మూలమైన రాశి పాత్రను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. అనవసరమైన పాటలను ఇరికించకుండా సినిమా రన్ టైం ను తగ్గించటం సినిమాకు ప్లస్ అయ్యింది. కొన్ని సన్నివేశాల్లో భయపెట్టారు. సిజ్జూ, సాహ పాత్రలు కీలకం. మిగిలిన పాత్రలు కూడా కథలో ఒదిగిపోయాయి. ముఖ్యంగా హీరోయిన్ ఈన సాహా మంచి వేరియేషన్స్ చూపించింది. ఒకే సినిమాలో రెండు డిఫరెంట్ వేరియషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించిన శిజు రెండు పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు. సుప్రీత్, సత్యం రాజేష్, సుదర్శన్, సత్యలు పాత్రకు తగ్గ నటనతో ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్‌:
భార్య రీ ఎంట్రీ కోసం దర్శకుడు శ్రీ ముని తయారు చేసుకున్న లైన్ బాగున్నా.. కథనం నడిపించిన తీరు మాత్రం ఆకట్టుకునేలా లేదు. ముఖ్యంగా చాలా సన్నివేశాలను జరగనివి జరిగినట్టుగా చూపించే ప్రయత్నంలో కన్య్ఫూజన్ క్రియేట్ అయ్యింది. పతాక సన్నివేశాల వరకు కూడా కథపై ఓ స్పష్టత రాదు. చాలా ప్రశ్నలకు సమాధానం దొరకదు. దాంతో కథలో ఏం జరుగుతోంది. దర్శకుడు ఏం చూపిస్తున్నాడనే అసహనం ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. ప్రథమ, ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తాయి.

సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడ్డాయి. . శ్రీ చరణ్ సంగీతం ఫర్వాలేదనిపించింది. అనవసరమైన పాటలను ఇరికించకుండా సినిమా రన్ టైం ను తగ్గించటం సినిమాకు ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

తీర్పు:
కథ, క్లైమాక్స్‌‌, ఫోటోగ్రఫీ మినహియిస్తే సినిమాలో చెప్పుకోదగ్గవి లేవు. దర్శకుడు ప్రేక్షకుడికి కథ ఒక పట్టాన అర్థం కాకూడదనే లక్ష్యంతో, బోలెడన్ని మలుపులతో ఆద్యంతం ఆసక్తికి గురి చేయాలని ఈ కథను పలు ఉప కథలతో తెరకెక్కించాడు. ఆ ప్రయత్నం ఒక దశ వరకైతే బాగుండేది కానీ, పతాక సన్నివేశాల వరకూ కథలో ఉన్న ముడులు బయటకు రావు. సినిమాలో ఏం జరుగుతుందో క్లైమాక్స్‌లోనే తెలుస్తుంది.

విడుదల తేదీ:21/04/2017
రేటింగ్: 2.25 /5
నటీనటులు :రాశి, సాయి రోనక్‌, ఐనా సాహ, సిజ్జు
సంగీతం:శ్రీచరణ్‌ పాకాల
నిర్మాత: నామన దినేష్‌, నామన విష్ణుకుమార్‌
దర్శకుడు:శ్రీముని

- Advertisement -