ధ‌ర‌ణితో భూస‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చెక్: హ‌రీశ్

43
harish rao
- Advertisement -

ధ‌ర‌ణితో భూస‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చెక్ ప‌డిన‌ట్లే అన్నారు మంత్రి హ‌రీశ్ రావు. వంద శాతం రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని వెల్ల‌డించారు. ధ‌రణి పోర్టల్ సమస్యలు, పరిష్కారం తదితర అంశాలపై సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తో క‌లిసి అధికారుల‌తో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ధరణి పోర్టల్‌కు సంబంధించి ప్రత్యేక పోర్టల్‌ పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్నారు. ఇందులో భాగంగా ములుగు మండలాన్ని పైలెట్‌ ప్రాజెక్ట్‌గా తీసుకున్నామని. కోర్టులు కేసులు, కుటుంబ తగాదాలతో కొన్ని భూ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

ధరణి ఒక విప్లవాత్మక కార్యక్రమం అని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ స్వయంగా రూపొందించారని…. నిజమైన భూ యజమానులకు భూమిపై హక్కు కల్పించాలని, భూమి బదిలీ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నదే ధరణి ఉద్దేశమని వెల్ల‌డించారు. ధరణి పోర్టల్‌లో ఎలాంటి సమస్య లేదు అన్నారు.

- Advertisement -