లాలూ ఆరోగ్య పరిస్థితి విషమం!

34
lalu
- Advertisement -

బీహార్ మాజీ సీఎం లాలూ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో బుధవారం అర్థరాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన నివాసంలో మెట్లపై నుంచి పడిపోవడంతో కుడి భుజం ఫ్రాక్షరైంది. ఈనేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆయనను పట్నాలోని పరాస్‌ దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళ్లారు.

కొంతకాలంగా కిడ్నీ, హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఢిల్లీలోని వైద్యులు గతంలో ఆయనకు చికిత్స చేశారని, మరీ అవసరమైతే చికిత్స కోసం సింగపూర్ తరలిస్తామని వెల్లడించారు.

- Advertisement -