- Advertisement -
బీహార్ రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి ఉత్కంఠగా మారుతున్నాయి. తన రాజకీయ మనుగడకు బీజేపీ నుంచి ముప్పు పొంచి ఉందని భావించిన సీఎం జేడీ(యూ) నేత నీతీశ్ కుమార్ ఎన్డీయే కూటమికి గుడ్‌బై చెప్పారు. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాలూ ఉంటేనే బీహార్ నడుస్తుందని అర్థం వచ్చేలా ఓ పాటను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. లాలూ లేకుండా బీహార్ నడవలేదు అనే భోజ్‌పురి పాట వీడియోను ట్విట్టర్లో పోస్టు చేసిన రోహిణి ఆచార్య. పట్టాభిషేకం సన్నహాలు జరుగుతున్నాయి… లాంతరు పట్టుకుని వస్తున్నారు అని రాసుకొచ్చారు. ఇక లాలూ మరో కుమార్తె రాజ్ లక్ష్మీ యాదవ్ కూడా తన తండ్రి సోదరుడి ఫోటోలను షేర్ చేశారు. బీహార్ తేజస్వీ పాలనను కోరుకుంటోందని ఆమె రాసుకొచ్చారు.
- Advertisement -