బోనమెత్తిన భాగ్యనగరం..

39
hyd bonalu
- Advertisement -

ఆషాఢ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం సహా 24 గుళ్లలో బోనాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని, మహమూద్ అలీ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

రాత్రి ఎనిమిదింటికి శాంతి కళ్యాణం జరగనుంది. రేపు పోతరాజుల వీరంగం.. నాలుగింటికి రంగం కార్యక్రమం ఉంటాయి. సాయంత్రం 6 నుంచి ఘటాలను ఊరేగించి అర్ధరాత్రి మూసీలో నిమజ్జనం చేస్తారు. పాతబస్తీలోని అమ్మవారి ఆలయాల్లో రెండురోజుల పాటు బోనాల జాతర జరగనుంది. బోనాల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయగా ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

- Advertisement -