గోల్కొండ బోనాల జాతర..ఆరంభం…

69
- Advertisement -

ఆషాడమాసం లో అత్యంత ఘనంగా జరుపుకునే బోనాల పండుగ నేడు గురువారం ఆరంభమయ్యింది. నేడు గోల్కొండ కోట లోని శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలిపూజతో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంబమయ్యాయి. లంగర్‌హౌజ్‌ చౌరస్తా వద్ద బంగారు నజర్ బోనానికి మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, మ‌హ‌మూద్ అలీ,త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ దీపం వెలిగించి, పూజలు నిర్వహించి తొట్టెల‌కు స్వాగతం పలికారు.

అనంత‌రం శ్రీ జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సంద‌ర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ.. బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు దేవాదాయ శాఖ కు కేటాయించారన్నారు. సీఎం ఆదేశానుసారంగా బోనాల ఉత్సవాలను ఘ‌నంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామ‌ని ఆయన తెలిపారు.

అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలి, వర్షాలు పడాలి, అభివృద్ది చెందాలి, ఆర్ధికంగా బలపడాలి అని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, , దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్,హైద‌రాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇత‌ర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -