శాస్త్రోక్తంగా లక్ష్మీనరసింహస్వామి లక్ష పుష్పార్చన..

481
yadadri
- Advertisement -

ప్రతీ ఏకాదశి పర్వదినం రోజు స్వయంభూ పంచనారసింహుడు కొలువు దీరిన యాదాద్రి క్షేత్రంలో స్వామిని లక్ష పుష్పాలతో అర్చించడం ఆలయ సంప్రదాయం. ఈ నేపథ్యంలోనే లక్ష్మీనరసింహస్వామి స్వామి సన్నిధిలో మంగళవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని లక్ష పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు సహస్ర నామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిద రకాల పూలతో లక్ష పుష్పర్చన జరిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఉప ప్రధాన అర్చకులు, వేద పండితులు, అర్చక బృందం, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

ఆలయ మూలవర్యులకు నిజాభిషేకం.. విశ్వక్సేనారాధన.. జలపూజ.. పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వస్తివాచనం చేయడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవ సంబురానికి సోమవారం ఉదయం ఆలయ అర్చకులు, అధికారులు శ్రీకారం చుట్టారు. ఆలయాన్ని విశేష పుష్పాలంకరణతో ముస్తాబు చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్ల విగ్రహాలకు ఆలయం ముఖ మండపంలో ప్రత్యేక పీఠంపై అధిష్ఠించి పూజలు చేశారు.

- Advertisement -