నామినేషన్ దాఖలు చేసిన పల్లా,జయసారథి రెడ్డి

25
palla

నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ దాఖలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి,వామపక్షాలు బలపర్చిన అభ్యర్థి జయసారథి రెడ్డి. నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకూ టీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాధోడ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

వామపక్షాల అభ్యర్థి జయసారథి రెడ్డి మంగళవారం కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జర్నలిస్టులు సహకరించాలని కోరారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పే లెక్కలన్నీ దొంగలెక్కలే అని అన్నారు. రెగ్యులర్ చేసిన పాత ఉద్యోగాలను కలిపి లక్షా31 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని అబద్ధం చెబుతున్నారని మండిపడ్డారు.ఈ నామినేషన్ కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు.