త్రినాథ‌రావు న‌క్కిన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ

229
rt68
- Advertisement -

మాస్‌మ‌హారాజ ర‌వితేజ హీరోగా సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శకుడు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొంద‌నుంది. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై ప్ర‌ముఖ నిర్మాత‌లు టి జి విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ర‌వితేజ 68వ సినిమాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ క‌థ‌, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాలో న‌టించే ఇతర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. ఈ సంక్రాంతికి విడుద‌లైన క్రాక్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న ర‌వితేజ త్వ‌ర‌లో ఖిలాడి సినిమాతో మ‌న ముందుకు రానున్నారు. ఖిలాడి మూవీ షూటింగ్ పూర్తి కాగానే ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు.

మాస్ మ‌హారాజా రవితేజ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి
బ్యాన‌ర్స్‌: పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్
నిర్మాత‌లు: టి జి విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్,
కో- ప్రొడ్యూస‌ర్‌: వివేక్ కూచిబొట్ల‌,
ద‌ర్శక‌త్వం: త్రినాథ‌రావు న‌క్కిన,
క‌థ‌, స్క్రీన్ ప్లే: ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ,
పిఆర్ఓ: వ‌ంశీ – శేఖ‌ర్‌.

- Advertisement -