TTD: 27న లక్ష కుంకుమార్చన

2
- Advertisement -

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా నవంబరు 27వ తేదీ బుధవారం ఆలయంలో లక్ష కుంకుమార్చన వైభవంగా నిర్వహించనున్నారు.ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి ఉత్సవర్లను శ్రీకృష్ణస్వామి ముఖ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు.

గృహస్తులు(ఇద్దరు) రూ.1,116/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, రెండు లడ్లు, రెండు వడలు బహుమానంగా అందజేస్తారు. ఆలయం వద్దగల కౌంటర్‌లో కరంట్‌ బుకింగ్‌లో భక్తులు ఈ టికెట్లు పొందొచ్చు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టికెట్లు కేటాయిస్తారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 28 నుండి డిసెంబ‌ర్ 6వ తేది వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని న‌వంబ‌రు 26న‌ మంగ‌ళ‌వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జ‌రుగ‌నుంది.

న‌వంబ‌రు 27వ తేదీ సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు.

Also Read:‘గేమ్ చేంజర్’.. థర్డ్ సింగిల్

శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల వాహన సేవల వివరాలు

తేది సమయం – వాహన సేవలు
28.11.2024 ఉ. 9.00 – ఉ.9.30 ధ్వజారోహణము
రాత్రి 7.00 – 9.00 చిన్నశేష వాహనము

29.11.2024 ఉ. 8 – 10 పెద్దశేష వాహనము
రా.7 – 9 హంస వాహనము
30.11.2024 ఉ. 8 – 10 ముత్యపు పందిరి వాహనము
రా. 7- 9 సింహ వాహనము
01.12.24 ఉ. 8 – 10 కల్పవృక్ష వాహనము
రా. 7 – 9 హనుమంత వాహనము
02.12.24 ఉ. 8 – 10 పల్లకి వాహనము
రా. 7 – 9 గజ వాహనము
03.12.24 ఉ. 8 – 10 సర్వభూపాల వాహనము
సా.4.20 – 5.20 స్వర్ణ రథోత్సవము
రా. 7 – 9 గరుడ వాహనము
04.12.24 ఉ. 8 – 10 సూర్య ప్రభ వాహనము
రా. 7 – 9 చంద్రప్రభ వాహనము
05.12.24. ఉ. 8 – 10 రథోత్సవము
రా. 7 – 9 అశ్వవాహనము
06.12.24 ఉ. 7 – 8 పల్లకీ ఉత్సవము
మ.12.15 – 12.20 పంచమి తీర్థము, రాత్రి: ధ్వజావరోహణం

07.12.2024 : సాయంత్రం – పుష్పయాగం

ALso Read:‘గేమ్ చేంజర్’.. థర్డ్ సింగిల్

- Advertisement -