లడ్ఢాఖ్‌లో లిథియం నిల్వలు…

87
- Advertisement -

విద్యుత్‌ పరికరాల తయారీలో ఉపయోగించే లిథియం నిల్వలు మొదటి సారి భారత్‌లో కనుగోన్నారు. జమ్ముకాశ్మీర్‌లో ఈ నిల్వలు 59లక్షలుగా ఉన్నాయని కేంద్ర గనుల శాఖ ప్రకటించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలిసారి జమ్ముకాశ్మీర్‌లోని కేంద్ర పాలిత ప్రాంతంలోని రియాసి జిల్లాలో హైమాన ప్రాంతంలో నిల్వలు కనుగొన్నట్టు గనుల శాఖ ట్విట్టర్‌లో ప్రకటించింది.

లిథియం ఉపయోగంతో విద్యుత్‌ పరికరాలు, మొబైల్, ఛార్జింగ్ బ్యాటరీలలో ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. లిథియం ఉత్పత్తితో దేశంలో చౌకగా ఫోన్‌లు బ్యాటరీలు ఉత్పత్తి మరింత విస్తరించనుంది. ప్రస్తుతం భారత్‌ లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి లోహాలను దిగుమతి చేసుకుంటోంది. తాజాగా లిథియం నిల్వలు కనుగొనడంతో భవిష్యత్‌లో విద్యుత్‌ వాహన తయారీ రంగానికి మరింత బలం చేకూరనుంది. ఈ-వాహనాల బ్యాటరీల తయారీలో లిథియం చాలా కీలకం. దీంతో భవిష్యత్‌లో లిథియంను దిగుమతులు తగ్గే అవకాశాలున్నాయి.

దేశవ్యాప్తంగా గనుల శాఖ మొత్తం 51ఖనిజ క్షేత్రాలను గుర్తించింది. వీటిలో 5క్షేత్రాల్లో బంగారం నిల్వలు ఉన్నట్టు కనుగొన్నారు. మిగిలిన చోట్ల పోటాష్ మాలిబ్డినం ఇతర ప్రాథమిక లోహాలను గుర్తించారు. 2018-19మధ్య నిర్వహించిన సర్వేల ఆధారంగా గుర్తించినట్టు..వీటిలో 17చోట్ల 7897మిలియన్ టన్నుల బొగ్గు లిగ్నైట్ ఉన్న గనులను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు అప్పగించింది.

ఇవి కూడా చదవండి…

మార్చిలో జీఎస్ఎల్వీ మార్క్‌-3..

నేటి బంగారం,వెండి ధరలివే

వైద్యరంగం మరింత బలోపేతం..

- Advertisement -